Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు టీఎస్ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Bandi Sanjay: షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు టీఎస్ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది టీఎస్ హైకోర్టు. భైంసా బయట సభ జరుపుకోవాలని షరతు విధించింది. అలాగే.. భైంసా మీదుగా పాదయాత్ర చేయకూడదని, నిర్మల్ మీదుగా పాదయాత్ర చేయాలని సూచించింది. పాదయాత్రకు 500 మందికే అనుమతి ఇచ్చిన ధర్మాసనం.. భైంసాకి 3 కిలోమీటర్ల దూరంలో సభ జరుపుకోవాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే సభకు అనుమతినిచ్చింది. ఇక.. 3 వేల మందితో మాత్రమే సభ జరుపుకోవాలని సూచించింది. ఇతర మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉండొద్దని హెచ్చరించింది. లా అండ్ ఆర్డర్‌ను పోలీసులు కాపాడాలన్న హైకోర్టు.. కార్యకర్తలు కర్రలు, వెపన్స్ వాడొద్దని సూచించింది.