Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలను రీషెడ్యూల్

Revanth Reddy: గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని నిర్ణయం

Update: 2023-12-12 02:49 GMT

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలను రీషెడ్యూల్

Revanth Reddy: TSPSC పరీక్షలపై కాంగ్రెస్‌లోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. TSPSC నిర్వహించిన పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన పరీక్షల్లో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలు అభ్యర్థులను గందరగోళానికి గురి చేయడంతో ప్రస్తుత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి TSPSC ఛైర్మన్, సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. TSPSC ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. TSPSC బోర్డుకు సంబంధించి వివిధ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. మరో రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన TSPSC నియామకాలకు సంబంధించి సమీక్ష జరగనుంది.

అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి ఫైళ్లతో రావాలని TSPSC ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని సీఎం ఆదేశించారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు TSPSC ద్వారా భర్తీ అయిన ఉద్యోగ పోస్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి జనార్ధన్‌రెడ్డి సమర్పించారు. సీఎం ఆదేశాల మేరకు TSPSC బోర్డుకు సంబంధించి పూర్తి నివేదికను అందజేశారు. మరో వైపు సమీక్షా సమావేశంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను మ‌ళ్లీ నిర్వహించే ప్రక్రియపై అధికారులు రివ్యూకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

మరో వైపు సీఎంతో సమావేశం ముగిసిన వెంటనే జనార్ధన్‌రెడ్డి తన పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సోమవారం ఆయన రాజీనామా చేయగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. జనార్దన్ రెడ్డి 2021లో TSPSC చైర్మన్‌గా నియమితులయ్యారు. కేసీఆర్ హయాంలో...TSPSC నిర్వహించిన పరీక్షలలో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అయితే త్వరలోనే TSPSC బోర్డు సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News