ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండ‌దు : మంత్రి కేటీఆర్‌

అన్నం పెట్టే రైతన్న ఆందోళన చేస్తే దేశానికి మంచిది కాదన్నారు మంత్రి కేటీఆర్. కార్పొరేట్‌ శక్తుల కోసమే కేంద్రం ఈ చట్టాలు తెచ్చిందని విమర్శించారు.

Update: 2020-12-08 08:53 GMT

అన్నం పెట్టే రైతన్న ఆందోళన చేస్తే దేశానికి మంచిది కాదన్నారు మంత్రి కేటీఆర్. కార్పొరేట్‌ శక్తుల కోసమే కేంద్రం ఈ చట్టాలు తెచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు వెనక్కితగ్గేది లేదన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండ‌దు. కానీ దేశ వ్యాప్తంగా రైత‌న్నలు క‌న్నీరు పెడుతున్న‌రని అన్నారు. షాద్‌న‌గ‌ర్ బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద రైతుల‌కు మ‌ద్ద‌తుగా కేటీఆర్ భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు టీఆర్ఎస్ పార్టీ రైతుల ప‌క్షాన పోరాడుతోంద‌ని ఈ సందర్బంగా కేటీఆర్‌ అన్నారు. 

Tags:    

Similar News