TRS: హుజురాబాద్‌ ఓటర్లకు లేఖలు పంపాలని టీఆర్ఎస్‌ అధిష్టానం నిర్ణయం

TRS: ఏడేళ్ల అభివృద్ధి వివరాలతో రెండు లక్షలకు పైగా ముద్రించిన టీఆర్ఎస్‌

Update: 2021-08-11 04:54 GMT

హుజురాబాద్ ఓటర్లకు లేఖలు పంపనున్న అధిష్టానం (ఫైల్ ఇమేజ్)

TRS: హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ అధిష్టానం. హుజురాబాద్‌లో విజయం సాధించేందుకు వీలుగా పలు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, నేతలకు బాధ్యతలను అప్పగించింది. వారి ఆధ్వర్యంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలోని అర్హులైన దళితులందరికీ అమలు చేసేందుకు పూనుకుంది టీఆర్ఎస్.

తాజాగా ఆ నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గులాబీ రంగు లేఖలు రాయాలని నిర్ణయించింది. రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, విదేశీ విద్యానిధి తదితర పథకాల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని ఇతర కుటుంబాలకూ వాటిని పంపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు లక్షలకు పైగా లేఖలను సిద్ధం చేస్తోంది. నియోజకవర్గంలో తాజాగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలనూ లేఖల్లో జోడించనుంది. ఓటర్లు ఆలోచించి ప్రభుత్వానికి ఓటు రూపంలో మద్దతు తెలపాలని అందులో కోరనుంది. సీఎం కేసీఆర్‌ పర్యటన కంటే ముందే వాటిని పంపిణీ చేసేలా పార్టీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.

Full View


Tags:    

Similar News