ఆరేళ్లలో హైదరాబాద్‌ ఎంతో పురోగతి : ఎమ్మెల్సీ కవిత

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆమె ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు.

Update: 2020-11-18 04:31 GMT

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆమె ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. పురోగతి విషయంలో ఆరేండ్ల క్రితం హైదరాబాద్ కు, ఇప్పటి హైదరాబాద్ కు తేడా ఉందన్నారు. రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులకు సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమనే కారణమని కొనియాడారు. హైదరాబాద్ వరుసగా ఐదేండ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించేందుకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ ను గెలిపించాల్సిందిగా కవిత కోరారు.

ఇక అటు ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకి షెడ్యుల్ వచ్చేసింది. డిసెంబర్ 01 న పోలింగ్ జరగనుండగా, 04 న కౌంటింగ్ జరగనుంది. అవసరమైన చోట డిసెంబర్ 03 న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం ఏడూ గంటల నుంచి సాయింత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ విషయాన్నీ ఎన్నికల కమిషినర్ పార్థసారథి నిన్న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నట్టుగా అయన వెల్లడించారు. అటు నేటినుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుండగా, 20 న నామినేషన్ల స్వీకరణకి చివరి తేది కానుంది.


Tags:    

Similar News