Kadiyam Srihari: రాజగోపాల్ రెడ్డిపై కడియం శ్రీహరి విమర్శలు
Kadiyam Srihari: కోమటి రెడ్డి బ్రదర్స్ కాదు... కోవర్టు బ్రదర్స్
Kadiyam Srihari: రాజగోపాల్ రెడ్డిపై కడియం శ్రీహరి విమర్శలు
Kadiyam Srihari: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కోవర్టు చర్యలకు పాల్పడ్డారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి చర్యలన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియవా అని ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఆయన పరిధిలో ఉపఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చెయ్యకపోవటమేంటని అడిగారు. అందుకే వారు కోమటి రెడ్డి బ్రదర్స్ కాదు... కోవర్టు బ్రదర్స్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది కోమటిరెడ్డి బ్రదర్స్‌ని విమర్శించారు.