అసెంబ్లీలో ఊహించని ఘటన.. పద్మారావు గౌడ్, రసమయి మధ్య వాగ్వాదం
Assembly Budget Session: ఆసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ పద్మారావుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఊహించని ఘటన.. పద్మారావు గౌడ్, రసమయి మధ్య వాగ్వాదం
Assembly Budget Session: ఆసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ పద్మారావుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసహనం వ్యక్తం చేశారు. రసమయి ప్రశ్న అడుగుతుండగా మైక కట్ చేశారు డిప్యూటి స్పీకర్. రసమయి బాలకిషన్ మాట్లాడుతున్న సందర్భంలో కేవలం ప్రశ్నలే అడగాలని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. దీనిపై స్పందించిన రసమయి ప్రశ్నలే అడుగుతున్నానని, అసలు విషయంపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. తొందరగా ప్రశ్నలే అడగండి.. ప్రసంగాలు వద్దూ అంటూ వ్యాఖ్యలు చేశారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాలని చెప్పారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ రసమయి తన కుర్చీలో సైలెంట్‌గా కూర్చుండిపోయారు.