Telangana: మరోసారి నోరుజారిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

Telangana: టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కొందరు నోరు జారుతున్నారు. తర్వాత నాలుక కరుచుకుంటున్నారు.

Update: 2021-04-02 15:54 GMT

Telangana: మరోసారి నోరుజారిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

Telangana: టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కొందరు నోరు జారుతున్నారు. తర్వాత నాలుక కరుచుకుంటున్నారు. గతంలో ఐయామ్‌ సారీ అని చెప్పిన నేతనే మళ్లీ నోరు జారారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే విమర్శలు గుప్పించారు.

గట్టు దిగుతున్నారు. కట్టు దాటుతున్నారు. సింగిల్‌ విండో లీడర్‌ షిప్‌ ఉన్న పార్టీలో పటిష్టమైన నాయకత్వంలో ఉన్న గులాబీ శిబిరంలో కొందరు వెనకా ముందు చూసుకోకుండా మాట్లాడతున్నారు. పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మైక్ పడితే ఏదో ఒక కాంట్రవర్సీ మాటల ఫ్లో లో ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు. ఇతర పార్టీల నేతలపై విరుచుపడుతూనే టీఆర్ఎస్ నేతలపై నోరు జారుతున్నారు.

ఇటీవల చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలతో ఏకంగా దాడులు, ప్రతీకార దాడులకు దిగే వరకు వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి నోరుజారారు.130 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తుంటే పట్టించుకోని పుణ్యుడు,పుణ్యాత్ముడు నరేంద్ర మోదీ, కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను గమనిస్తే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పొరపాటున కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు స్పష్టమవుతోంది.

గతంలోనూ అయోధ్య రామాలయ నిర్మాణం విరాళాల సేకరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందిన వారికి అక్షరం ముక్క రాదని వ్యాఖ్యానించారు. వారికి అసలు పని చేయడమే రాదని వారి వల్లే రాష్ట్రం నాశనమైందన్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజాస్వామిక సంఘాలు,బహుజన సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఎమ్మెల్యే చల్లా క్షమాపణలు చెప్పక తప్పలేదు.

అయోధ్య రామమందిరం విరాళాలపై కూడా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడిని బీజేపీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోందని పరకాల ఆరోపించారు. రాముడ్ని రాజకీయంలోకి లాగి అపవిత్రం చేస్తున్నారని ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం పేరుతో చందాలు వసూళ్లు చేస్తున్నారని చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు చల్లా ధర్మా రెడ్డిపై భగ్గుమన్నారు. ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేశారు.

అధికార పార్టీలో ఉండే నాయకులు నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా ప్రతిపక్షాలు దాన్ని అవకాశంగా మలుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఇటీవల కాలంలో పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడా ఇటువంటివి సంభవిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలకు అస్త్రాలను అందిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News