Bandi Sanjay: బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ నేతల యత్నం
Bandi Sanjay: బండి సంజయ్ నల్గొండ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తత
బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)
Bandi Sanjay: బండి సంజయ్ నల్గొండ పర్యటనలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండిసంజయ్‌ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ నేతల యత్నించారు. సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల నినాదాలు చేశారు. మిర్యాలగూడలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో ఇరు పార్టీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టీఆర్‌ఎస్ నేతల తీరుకు వ్యతిరేకంగా అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేపై బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఘర్షణ నేపథ్యంలో బండి సంజయ్ వెనుదిరిగారు.