Bandi Sanjay: ప్రముఖులకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు..
Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
Bandi Sanjay: ప్రముఖులకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు..
Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఆ పార్టీ తమకు పోటీయే కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకే వేరే పేర్లు పెట్టి ఫోటోలు మారిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని జాతీయ కార్యవర్గ సమావేశాలకు చాలా మంది ప్రముఖులు వస్తుంటే ప్రోటోకాల్ ఇవ్వడం లేదని బండి సంజయ్ అన్నారు. ఇదీ మంచి పద్ధతి కాదని హితవు పలికారు. జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు వస్తే.. ప్రోటోకాల్ పాటించడం కనీస ధర్మం అని వివరించారు.