Municipal Elections: కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ దృష్టి

Municipal Elections: వరంగల్‌, ఖమ్మంలో స్థానాలన్నీ కైవసం చేసుకునేలా ప్రణాళిక

Update: 2021-04-26 13:14 GMT

తెరాస (ఫైల్ ఇమేజ్)

Municipal Elections: తెలంగాణలో కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో చివరి ఎన్నికలు కావడంతో సీఎం కేసీఆర్ సీరియస్‌గా దృష్టి పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లకు.. ఈ ఎన్నికల గెలుపును రెఫరెండంగా భావిస్తున్నారు. ఖమ్మం, వరంగల్‌లోని అన్ని స్థానాలు కైవసం చేసుకునేలా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం కేసీఆర్‌.

ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు 5 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మంత్రి కేటీఆర్‌ భావించినా.. కరోనా సోకడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. అయినప్పటికీ.. కరోనా చికిత్స పొందుతూనే.. ఎన్నికలపై సమీక్షలు చేస్తున్నారు కేటీఆర్‌. అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడేలా నేతలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ఫోన్‌లో పలు సూచనలు చేస్తున్నారు మంత్రి.

మరోవైపు.. ఎన్నికలు జరిగే మున్సిపాల్టీలతో పాటు కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఫోన్‌ ద్వారా టచ్‌లో ఉంటున్నారు సీఎం కేసీఆర్‌. ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని నేతలను సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సలహాలు ఇస్తున్నారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యత.. స్థానిక ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారట సీఎం.

మొత్తానికి.. కరోనా సోకి, హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ.. దృష్టంతా మాత్రం మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలపైనే పెట్టారు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌. ప్రచారానికి సంబంధించి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారు. వరంగల్‌, ఖమ్మం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుపోవాలని నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మరి.. ఈ కష్టానికి ప్రతిఫలం ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News