Sangareddy: చైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన సొంత పార్టీ కౌన్సిలర్లు
Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది.
Sangareddy: చైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన సొంత పార్టీ కౌన్సిలర్లు
Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా మరోసారి గళమెత్తారు సొంత పార్టీ కౌన్సిలర్లు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార BRS పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా స్వంత పార్టీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. అవినీతి చైర్ పర్సన్ గద్దె దిగాలాంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు. గతంలోనూ మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ కౌన్సిలర్లు. మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగాల్లో అవకతవకలకు పాల్పడిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేయగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ బంధువులే ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది.