Kishan Reddy: టీఆర్‌ఎస్ దిగజారి వ్యవహరిస్తోంది
Kishan Reddy: తప్పుడు సందేశాలతో హోర్డింగ్‌లు పెడుతున్నారు
Kishan Reddy: టీఆర్‌ఎస్ దిగజారి వ్యవహరిస్తోంది
Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రధాని మోడీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
బీజేపీ కార్యాకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ హార్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేస్తామన్నారు. మోడీ రాక కోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు.