Attender Cleans Trainee Collector Shoes: తోటి ఉద్యోగితో బూట్లకు అంటుకున్న బురదను తుడిపించిన ట్రైనీ కలెక్టర్

Attender Cleans Trainee Collector Shoes: ట్రైనీ ఐఏఎస్ అంకిత్ వివాదంలో చిక్కుకున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి.

Update: 2020-07-06 12:45 GMT

Attender Cleans Trainee Collector Shoes: ట్రైనీ ఐఏఎస్ అంకిత్ వివాదంలో చిక్కుకున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. విధి నిర్వహణలో భాగంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కాల్వల గ్రామంలో పర్యటించిన ఆయన పొలాల్లోకి వెళ్లారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంత మంతా బురదమయంగా మారిపోవడంతో ఆయన వేసుకున్న బూట్లకు బురద అంటుకుంది. దీంతో ట్రైనీ కలెక్టర్ తన బూట్లకు అంటుకున్న బురదను అటెండర్ తో క్లీన్ చేయించుకున్నారు.

అంటెండర్ చెట్టు కొమ్మను విరిచి ఆయన బూట్లకు అంటుకున్న బురదను తొలగించారు. ఇది చూసిన కొంత మంది జనం తోటి ఉద్యోగితో ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. శిక్షణలో ఉండగానే కింది స్థాయి ఉద్యోగులతో ఇలా వ్యవహరిస్తే ఉద్యోగంలో చేరితే ఇంకెలా వ్యవహరిస్తారో అని ప్రజలు ట్రైనీ కలెక్టర్‌పై మండిపడుతున్నారు. అటెండర్ బూట్లను క్లీన్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో కష్టపడి, సివిల్స్ రాసిన ఆయన అనవసరంగా వివాదాల్లో ఇరుక్కున్నారనే భావన కూడా వ్యక్తం అవుతోంది. అసలు వానాకాలంలో పొలాల్లోకి బూట్లు వేసుకొని వెళ్లడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు.  


Tags:    

Similar News