చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

Update: 2019-04-09 13:05 GMT

హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్‌ 6లో నిలిచి ఉన్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుప్రక్కల ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగలు ఆవరించాయి.. ఈ కారణంగా పలువురు ప్రయాణికులు కాసేపు గందరగోళానికి గురయ్యారు.

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిలిచి ఉన్న రైలు కావడం.. ప్రయాణికులెవరూ అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. 

Similar News