Nizamabad: రెండ్రోజుల్లో పెళ్లి.. యువకుడు ఆత్మహత్య

Nizamabad: మరో రెండు రోజుల్లో ఓ యువకుడిది పెళ్లి. ఇంట్లో పెళ్లి పనులు జోరందుకున్నాయి.

Update: 2025-11-12 06:27 GMT

Nizamabad: రెండ్రోజుల్లో పెళ్లి.. యువకుడు ఆత్మహత్య

Nizamabad: మరో రెండు రోజుల్లో ఓ యువకుడిది పెళ్లి. ఇంట్లో పెళ్లి పనులు జోరందుకున్నాయి. బంధువులు రావడం కూడా మొదలైంది. ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. కానీ ఇంతలోనే ఆ యువకుడు చేసిన పని కుటుంబసభ్యులను కన్నీటి సంద్రంలోకి నెట్టింది. రెండ్రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు తీసుకున్న నిర్ణయం పెళ్లింట విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లా మంగల్పాడు గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ పెళ్లి ఫిక్స్ అయ్యింది.

మరో రెండ్రోజుల్లో అతడి పెళ్లి. కానీ కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయి. కుటుంబ కలహాలతో ప్రతాప్ గౌడ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన ప్రతాప్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. టానా కలాన్ శివారులో చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో పేరెంట్స్, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Tags:    

Similar News