Traffic Jam: కట్టెల లారీ బోల్తా.. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్

Traffic Jam on Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Update: 2026-01-13 11:01 GMT

Traffic Jam: కట్టెల లారీ బోల్తా.. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్

Traffic Jam on Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో కర్రల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రహదారిపై కర్రలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు మూడు జేసీబీలు, రెండు క్రేన్ల సహాయంతో రోడ్డుపై పడిన కర్రలను తొలగిస్తున్నారు. లారీ బోల్తా పడటంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సంక్రాంతి పండగకు ప్రయాణిస్తున్న ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Tags:    

Similar News