Mallareddy: సంక్రాంతి వేడుకల్లో మల్లారెడ్డి హంగామా.. చిన్నారులతో డాన్స్
Malla Reddy: చిన్నారులతో కలిసి డాన్స్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.
Malla Reddy: సంక్రాంతి వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు.
చిన్నారులతో కలిసి డాన్స్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. భోగి మంటల వద్ద సందడి చేస్తూ సంక్రాంతి వేడుకల్లో భాగమయ్యారు. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మల్లారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.