Khammam: ఫ్రాన్స్ యువకుడితో ఖమ్మం అమ్మాయి పెళ్లి
Khammam: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ప్రశాంతికి ఫ్రాన్స్ యువకుడితో ఘనంగా వివాహం జరిగింది.
Khammam: ఫ్రాన్స్ యువకుడితో ఖమ్మం అమ్మాయి పెళ్లి
Khammam: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ప్రశాంతికి ఫ్రాన్స్ యువకుడితో ఘనంగా వివాహం జరిగింది.
ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రశాంతి, చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం సంపాదించింది. ఆమె పనిచేస్తున్న కంపెనీలోనే నాథన్ క్రిష్టోఫ్ జూబర్ అనే ఫ్రాన్స్ యువకుడితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.
రెండు దేశాల సంస్కృతి, సంప్రదాయాలు వేర్వేరైనా, ఇరు కుటుంబాల సమ్మతితో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రేమకు సరిహద్దులు లేవని ఈ వివాహం మరోసారి నిరూపించింది.