China Manjha: చైనా మంజా అంశంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్
China Manjha: ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్న చైనా మంజా విక్రయాలు, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGSHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
China Manjha: చైనా మంజా అంశంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్
China Manjha: ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్న చైనా మంజా విక్రయాలు, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGSHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కమిషన్… ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది.
తెలంగాణలో ఇప్పటికే నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, చైనా మంజా వినియోగం వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ ఇమ్మానేని రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 30న దాఖలైన ఈ పిటిషన్‌లో చైనా మంజాను పూర్తిగా నిషేధించడంతో పాటు, విక్రయాలు మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం… రాష్ట్రవ్యాప్తంగా చైనా మంజా కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కీసరలో జశ్వంత్ రెడ్డి అనే బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అలాగే షమ్షేర్‌గంజ్‌లో జమీల్ అనే వ్యక్తికి మెడ చుట్టూ లోతైన కోతపడి సుమారు 22 కుట్లు పడిన ఘటన చోటుచేసుకుంది. చైనా మంజా గాజు లేదా మెటల్ కోటింగ్‌తో తయారవుతుండటంతో ఇది అత్యంత ప్రమాదకరమని పిటిషనర్ కమిషన్‌కు వివరించారు.
చైనా మంజాను పూర్తిగా నిషేధించడమే కాకుండా, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో జరుగుతున్న అమ్మకాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల హైదరాబాద్ పోలీసులు చైనా మంజా విక్రయాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.24 కోట్ల విలువైన చైనా మంజా స్టాక్‌ను సీజ్ చేయడంతో పాటు, 143 మందిని అరెస్ట్ చేశారు.