Jagga Reddy: నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని

Jagga Reddy: పార్టీకి నా తీరు నచ్చకుంటే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తా

Update: 2022-01-06 00:54 GMT

నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి తన తీరు నచ్చకుంటే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన తాను ముక్కుసూటిగా మాట్లాడే మనిషినని అన్నారు. దీంతో జగ్గారెడ్డిని వారించిన మాజీమంత్రి శ్రీధర్‌బాబు తప్పుకోవడం ఎందుకు? సరిదిద్దుకుని పనిచేయాలని సూచించారు.

మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీరుపై ఇంఛార్జ్‌ ఠాగూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచించిన ఠాగూర్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏఐసీసీ కార్యదర్శి గానీ, సోనియాకు గానీ, లేదా తనకు గానీ లేఖలు రాయాలన్నారు. ఎవరికి వారు మాట్లాడుకుంటూ పోతే పార్టీకి నష్టమన్న ఠాగూర్‌ ఇకపై ఇలాంటివి రిపీట్‌ అయితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News