Gandhi Bhavan: గాంధీభవన్‌లో మ.2 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి భేటీ
Gandhi Bhavan: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం
Gandhi Bhavan: గాంధీభవన్‌లో మ.2 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి భేటీ
Gandhi Bhavan: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నూతనంగా ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా నియమితులైన దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, పీఈసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్లు అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కార్యవర్గ సమావేశం ఇది.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే టార్గెట్‌గా ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా నియామకం అయిన తర్వాత దీపాదాస్ మున్షీ రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా నేతలందరూ అభినందనలు తెలపనున్నారు. అటు ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన మాణిక్‌రావు థాక్రేకు వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టులపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.