Revanth Reddy: నేడు నాగార్జునసాగర్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy: మే 6న జరిగే రాహుల్ సంఘర్షణ సభ కోసం సన్నాహక సమావేశం
నేడు నాగార్జునసాగర్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Revanth Reddy: నేడు నాగార్జునసాగర్ కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మే 6న జరిగే రాహుల్ సంఘర్షణ సభ విజయవంతం కోసం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే నల్గొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల విస్తృత సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి ఈ సమావేశ ప్రారంభం కానుంది. నల్గొండ టూర్ అనంతరం రేవంత్ నేరుగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు రేవంత్ రెడ్డి.