ప్రధాని మోడీకి రేవంత్‌రెడ్డి లేఖ.. వరదలతో తెలంగాణ అతలాకుతలమైంది
Revanth Reddy: తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలు నష్టపోయారు
ప్రధాని మోడీకి రేవంత్‌రెడ్డి లేఖ.. తెలంగాణ లో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలి
Revanth Reddy: ప్రధాని మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. వరదలతో తెలంగాణ అతలాకుతలమైందని, రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని లేఖలో తెలిపారు. తెలంగాణలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించాలని మోడీని కోరారు. ఇక.. వరద పరిస్థితిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేసిన రేవంత్.. మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తెలంగాణలో ఎకరం పంట కూడా మునగలేదని కేటీఆర్ అంటున్నారు.. పంట నష్టం జరగలేదని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఒకవేళ నష్టం వాటిల్లిందని రుజువు చేస్తే కేటీఆర్ ముక్కు నేలకు రాసి, తెలంగాణ రైతులకు క్షమాపణ చెబుతారా? అంటూ సవాల్ విసిరారు రేవంత్‌రెడ్డి.