Revanth Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరం
Revanth Reddy: కేసీఆర్ హయాంలో నేతలకు ఫిరాయింపుల రోగం వచ్చింది
Revanth Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరం
Revanth Reddy: మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ హయాంలో నేతలకు ఫిరాయింపుల జబ్బు వచ్చిందని విమర్శించారు. గతంలో నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారని..ఇప్పుడు రాజ్‌గోపాల్‌రెడ్డి అదే బాటలో పయనించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో మునుగోడు ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించిన రేవంత్‌రెడ్డి..కార్యకర్తలంతా శ్రమించి పార్టీని గెలిపించాలని సూచించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి, గీతా రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.