Mahesh Kumar Goud: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
Mahesh Kumar Goud: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
Mahesh Kumar Goud: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
Mahesh Kumar Goud: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తెలంగాణ ప్రజలపై పవన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని ఆయన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"తెలంగాణ ప్రజలపై పవన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.""ఆంధ్ర ప్రజలపై మాకు కోపం ఏమీ లేదు.""ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ, కుటుంబ సభ్యులుగా కలిసి ఉందాం.""బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు." రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, రెండు ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండాలనేదే తమ ఆకాంక్ష అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.