Medaram: నేడు మేడారానికి మంత్రులు సీతక్క, పొంగులేటి
Medaram: జాతరలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
Medaram: నేడు మేడారానికి మంత్రులు సీతక్క, పొంగులేటి
Medaram: మహా కుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా, రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశం నలువైపుల నుంచి వాహనాలు మేడారం వైపు సాగుతున్నాయి. ఈనెల 21న గిరిజన జాతర ప్రారంభం కానుండగా.., ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపడుతున్నారు. జాతర ప్రారంభమైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ మేడారానికి వెళ్లనున్నారు. జాతరలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మీడియా టవర్, ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రులు ప్రారంభించనున్నారు.