నేడు మరోసారి ఈడీ ముందుకు రాహుల్ గాంధీ
Rahul Gandhi: *నిన్న రాత్రి 10 గంటల వరకు ప్రశ్నించిన ఈడీ
నేడు మరోసారి ఈడీ ముందుకు రాహుల్ గాంధీ
Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట నేడు మరోసారి రాహుల్ గాంధీ విచారణకు హాజరుకానున్నారు. కాగా నిన్న రాత్రి 10 గంటల వరకు రాహుల్ గాంధీని ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇదిలా ఉండగా కాసేపట్లో ఏఐసీసీ దగ్గర కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. మరోవైపు ఈడీ విచారణపై కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక రెండోరోజు విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు పోలీసులు. అక్బర్ రోడ్, జన్‌పథ్ మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.