TS Assembly: ఇవాళ నాలుగో రోజు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ
TS Assembly: ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం
TS Assembly: ఇవాళ నాలుగో రోజు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ
TS Assembly: ఇవాళ నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. మంత్రి హరీశ్ రావు గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పేపర్స్‌ను టేబుల్ చేయనున్నారు. ఉభయ సభల్లో ఒకే అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చించనున్నారు. నిన్న శాసన సభలో ప్రవేశపెట్టిన ఐదు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం ఉంది.