ఈరోజు, రేపు వారణాసిలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల పర్యటన
* వారణాసిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత * ఇవాళ తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్లో ప్రయాణం
Chief Minister KCR Family (file image)
సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత నేడు, రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఇవాళ తొలుత అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా ఆర్తి, గంగా పూజను తిలకించి. అస్సి ఘాట్‌కు బోట్లో తిరుగు ప్రయాణం అవనున్నారు. అనంతరం సంకత్మోచన్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.