అత్తాపూర్ హత్య కేసులో సంచలన తీర్పు

Update: 2020-02-28 15:10 GMT
అత్తాపూర్ హత్య కేసులో సంచలన తీర్పు

అత్తాపూర్‌లో నడిరోడ్డుపైన ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపినా ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.. అయితే ఈ హత్యకి కారణం అయిన ముగ్గురు నిందితులకి రంగారెడ్డి కోర్టు కీలక తీర్పును వెలువరిస్తూ .. జీవితఖైదు విధించింది. 2018 అక్టోబర్‌లో విక్రమ్ సింగ్, లక్ష్మణ్ గౌడ్, కిషన్‌ అనే ముగ్గరు వ్యక్తులు అత్తాపూర్‌లో రమేశ్ (34) అనే వ్యక్తిని నడిరోడ్డుపై నరికి చంపారు.

ఇద్దరు మిత్రులు.. ఓ అక్రమ సంబంధం..

పాతబస్తీలో నివసించే మహేష్, రమేష్ మంచి స్నేహితులు.. అయితే రమేష్ కి ఇంటిపక్కన ఉన్న మహిళతో అక్రమసంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మహేష్ సదరు మహిళను కోరాడు. అందుకు సహకరించకపోతే వ్యవహారం మొత్తం అందరికీ చెబుతానని బెదిరించాడు. ఈ విషయాన్నీ ఆమె రమేష్ కి చెప్పడంతో మిత్రుల మధ్య భేధాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత తన భర్తకి ఈ విషయం తెలియడంతో ఆమెను తీసుకొని వేరే ఊరుకి వెళ్ళిపోయాడు. అయితే ప్రియురాలు మహేష్ ని రమేష్ చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు.

పగతో మహేష్ తండ్రి :

మహేష్ హత్యతో తీవ్రంగా కుంగిపోయిన మహేష్ తండ్రి కిషన్ గౌడ్ రమేష్ పై పగ తీర్చుకోవాలని రమేష్ ని చంపేందుకు పక్కా ప్లాన్ చేశాడు. ఈ నేపధ్యంలో 2018 సెప్టెంబర్ 26న రమేశ్ రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో కేసు వాయిదా కోసం వెళ్తున్నాడని తెలిసుకొని రమేష్ ని గొడ్డలితో నరికి చంపేశాడు. ఇందులోని ప్రధాన నిందితులు అయిన విక్రమ్ సింగ్, లక్ష్మణ్ గౌడ్, కిషన్‌ గౌడ్ అనే ముగ్గరు వ్యక్తులకి కోర్టు జీవిత ఖైది విధించింది.  

Tags:    

Similar News