Birthday Celebration: ఆ బామ్మకు 105 ఏండ్లు..గ్రాండ్గా బర్త్ డే సెలబ్రేషన్స్
Birthday Celebration: క్రికెట్‌లో సెంచరీ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.
Birthday Celebration: ఆ బామ్మకు 105 ఏండ్లు..గ్రాండ్గా బర్త్ డే సెలబ్రేషన్స్
Birthday Celebration: క్రికెట్‌లో సెంచరీ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ మనషుల వయస్సు వంద దాటితే.... అది అద్భుతమే. కొన్నేళ్ల క్రితం వందేళ్లు జీవించడం... సాధారణమే అయినా... ప్రస్తుతం మచ్చుకు మాత్రమే ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. అలా కరీంనగర్‌లో ఓ బామ్మ తారసపడింది. గంగాధర మండలం చెర్లపల్లి ఆర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ 105 ఏళ్లు పూర్తి కావడంతో ఘనంగా బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఇక్కడ మరో విశేషం ఏమంటే... బామ్మకు ఇంకా కంటి చూపు కాని, వినికిడి సమస్య కానీ లేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుందని అంటున్నారు. వేప చెట్టే తన ఆరోగ్య రహస్యమంటూ నవ్వుతూ తన జ్ఞాపకాలను పంచుకుంటుంది బామ్మ.