Vikarabad: దొంగల హల్‌చల్.. 2 తులాల బంగారం..8 తులాల వెండి.. రూ.85 వేలు అపహరణ
Vikarabad: పరిగి మున్సిపాలిటీలో వారంరోజుల వ్యవధిలో 3 దొంగతనాలు
Vikarabad: దొంగల హల్‌చల్.. 2 తులాల బంగారం..8 తులాల వెండి.. రూ.85 వేలు అపహరణ
Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేరవెల్లిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. గడ్డపారతో ఇంటి తాళాలు పగలగొట్టి.. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, ఎనిమిది తులాల వెండి, 85 వేల నగదు దొంగలించినట్లు బాధితులు ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు.. పరిగి మున్సిపాలిటీలో వారంరోజుల వ్యావధిలో 3 దొంగతనాలు జరిగాయి. రాత్రి ఓ ఇంటి ముందు పెట్టిన వాహనాన్ని దొంగలించడానికి ప్రయత్నించాడు దొంగ. అయితే.. ఒక్కసారిగా బైక్ కిందపడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది, దాంతో.. భయంతో బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు దొంగ. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసుల నిఘా వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.