దొంగను కాపాడిన కరోనా..

Update: 2020-04-14 14:14 GMT

నగరంలో ఎన్నో దొంగతనాలు చేసి, పోలీసులకు చిక్కిన దొంగను కరోనా వైరస్ జైలుకు వెళ్లకుండా కాపాడింది. నల్లగొండ జిల్లా చంటపల్లి తండాకు చెందిన జటావత్‌ మహేష్‌(19) తనకి 15 సంత్సరాలు ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేయడానికి అలవాగు పడ్డాడు. ఇప్పటి వరకు మహేష్ హైదరాబాద్ నగరంతో పాటు నల్లగొండలోని అనేక ప్రాంతాల్లో 50కి పైగా దొంగతనాలు చేసాడు. అతనికి 15 ఏళ్లు ఉన్నప్పుడు దొంగతనం చేసి పోలీసులకు పట్టుపడడంతో అతన్ని జువైనల్ హోమ్‌లో ఉంచారు. ఆ సమయంలోనే అతనికి గచ్చిబౌలిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో(ఏన్‌ఏసీ) చేర్పించారు. రెండేళ్ల ఎనిమిది నెలల శిక్షకాలం పూర్తి చేసుకున్న మహేష్‌ గతనెల ఎన్‌ఏసీ నుంచి పరారయ్యాడు. కాగా బయటికి వచ్చిన తరువాత చేతి వాటం ఆపుకోలేక మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు.

బయటికి వచ్చిన మహేష్ మైనారిటీ కూడా లాక్ డౌన్ కు వారం రోజుల ముందే తీరింది. అప్పటి నుంచి ఆ దొంగ కంచన్‌బాగ్, సరూర్‌నగర్, నల్లగొండ, మలక్‌పేటలో రెండు వాహనాలు దొంగతనం చేయగా, మరో రెండు ఇండ్లలో చోరీ చేసాడు. మొత్తం నాలుగు చోట్ల దొంగతనాలు చేశాడు. కాగా పోలీసులు అప్పటి నుంచి అతని కోసం గాలిస్తునే ఉండి ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ మేరకు అతని దగ్గరినుంచి చేసి రూ.15 లక్షలు విలువైన నగదు, బంగారం, వాహనాలు రికవరీ చూపారు. అతనికి పీడియాక్ట్ కింద కేసు నమోదుచేయాలని పోలీసులు నిర్ణయించారు.

అతన్ని అరెస్టు చేసిన పోలీసులు ఫార్మాలిటీలను పూర్తి చేసి వైద్య పరీక్షల కోసం కంచన్‌బాగ్‌ అధికారులు ఆదివారం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా అతను దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో అతని చేతిపై వైద్యులు 14రోజుల క్వారంటైన్‌ ముద్ర వేశారు. అనంతరం అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా జ్యిడిషియల్ రిమాండ్ కు పంపించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్ళారు.

కాగా అక్కడి జైలు అధికారులు నిందితుని చేతిపై ఉన్న క్వారంటైన్‌ ముద్రను చూసి రిమాండ్‌కు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు మళ్లీ అతన్ని కోర్టుముందు హాజరు పరచగా అతన్ని హోం క్వారంటైన్‌కు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కాగా నిందితున్ని పోలీసులు ఆదివారం రాత్రి చంటపల్లి తండాకు తీసుకువెళ్లి ఇంటి వద్ద క్వారంటైన్‌ చేసి వచ్చారు.  


Tags:    

Similar News