Kishan Reddy: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేపర్ల మీదే.. భూమి మీద ఉండవు
Kishan Reddy: ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు
Kishan Reddy: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేపర్ల మీదే.. భూమి మీద ఉండవు
Kishan Reddy: మాటలు చెప్పి... గారడీలు చేసి ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలనే డిమాండ్‌తో ధర్నాచౌక్‌లో బీజేపీ చేపడుతున్న మహాధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి.