Niranjan Reddy: అయోవా.. తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి
Niranjan Reddy: తెలంగాణలో 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించిన మంత్రి
Niranjan Reddy: అయోవా.. తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి
Niranjan Reddy: తెలంగాణ - అయోవా రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్‌ను కలిశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్‌కు మంత్రి వివరించారు. వ్యవసాయిక రాష్ట్రంగా పేరుగాంచిన అయోవా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు మంత్రి సింగిరెడ్డి. రెండు రాష్ట్రాలూ ఆహారాధాన్యాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసాహార ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా నిలిచాయని, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.