Minister KTR: మన పిల్లలు అనుకుని కుక్కల బెడదను అరికట్టాలి
Minister KTR ఇలాంటి ఘటనలు మనకు అవమానకరం..మనమే ఏమీ చేయలేకపోతే ఎవరు చేస్తారు
Minister KTR:మన పిల్లలు అనుకుని కుక్కల బెడదను అరికట్టాలి
Minister KTR: జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేలా పనిచేయాలని అధికారులను కోరారు మంత్రి కేటీఆర్. కుక్కల సమస్యల పై ఇక పై మరింత వేగంగా స్పందించాలని సూచించారు. హైటెక్స్‌లో జరిగిన సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లు, బిల్డింగ్‌లు ఉన్నంత మాత్రాన హైదరాబాద్ విశ్వనగరంగా మారదన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలకు కావాల్సిన కనీస వసతులను కల్పించేలా, వారి కనీస అవసరాలను తీర్చేలా పని చేయాలని అధికారులను కోరారు.