Bhatti Vikramarka: హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ లేదు
Bhatti Vikramarka: ఈ కేసును సీబీఐకి అప్పగించాలి
Bhatti Vikramarka: హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ లేదు
Bhatti Vikramarka: అమ్నేషియా పబ్ ఘటనతో రాజకీయ దుమారం రేగుతోంది. మైనర్లకు పబ్బు లోపలికి ఎలా అనుమతి ఇచ్చారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పబ్ భాగోతంపై స్పందిచిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పబ్బులుపై నియంత్రణ ఉండదా..? అంటూ ప్రశ్నించారు.
పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రికి అసలు అధికారాలే లేవు అంటూ ఎద్దేవా చేశారు. మైనర్లను పబ్బుల్లో అనుమతి ఇచ్చిన వారిపై.. పబ్బుపై చర్యలు తీసుకోవాలని, అత్యాచారం కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.