Arvind Dharmapuri: ఆర్ముర్‌లో బీజేపీ చాయ్ పే చర్చలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్
Arvind Dharmapuri: రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం
Arvind Dharmapuri: కేంద్ర ప్రభుత్వ పథకాలకు కట్ ఆఫ్ లేదు
Arvind Dharmapuri: రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్ముర్ లో బీజేపీ చాయ్ పే చర్చలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ పసుపు, మామిడి రెండు పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగానే పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని.. మంచి ధర లభిస్తుందన్నారు. పసుపు బోర్డు వస్తే.. విత్తనాలు భూసార పరీక్షలు మొదలైన అంశాలపై దృష్టి సారించినట్టు చెప్పారు. పరిమితిలో ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందన్నారు. బోర్డు కారణంగా గోదాములు, పసుపు శుద్ది కర్మాగారాలు వస్తాయన్నారు. రైతుల వద్దకే కొనుగోలుదారు వచ్చి పంట కొనేలా వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు.