హైదరాబాద్ ఉప్పల్లో ఆర్టీసీ బస్సుల్లో రాత్రి చోరీ – నగదు, బాగ్, సెల్‌ఫోన్ దొంగతనం

హైదరాబాద్ ఉప్పల్లో ఆర్టీసీ బస్సుల్లో చోరీ డ్రైవర్ నగదు, బ్యాగ్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు నైట్ హాల్ట్‌కి వచ్చిన సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులు డైవర్ నిద్రిస్తున్న సమయంలో ఘటన

Update: 2025-10-14 10:00 GMT

హైదరాబాద్ ఉప్పల్లో ఆర్టీసీ బస్సుల్లో రాత్రి చోరీ – నగదు, బాగ్, సెల్‌ఫోన్ దొంగతనం

హైదరాబాద్ ఉప్పల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసి ఉన్న రెండు ఆర్టీసీ బస్సుల్లో.. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. నైట్ హాల్ట్‌కి వచ్చిన తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల డ్రైవర్లకు సంబంధించిన నగదు, బ్యాగ్, సెల్ ఫోన్, వస్తువులను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో లేచి చూసుకునే సరికి.. చోరీ జరిగినట్టు గుర్తించిన డ్రైవర్లు పోలీసులకు ఫర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నైట్ హాల్ట్‌లో తమకు రూములు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని డ్రైవర్లు తెలిపారు.

Tags:    

Similar News