పెద్దఅంబర్‌పేట్‌లో దొంగల హల్‌చల్: 2 ఇండ్లలో వెండి, బంగారం, నగదు చోరీ
హయత్ నగర్ పెద్దఅంబర్ పేట్‌లో దొంగల బీభత్సం సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా 2 ఇండ్లలో చోరీ సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన దొంగలు
పెద్దఅంబర్‌పేట్‌లో దొంగల హల్‌చల్: 2 ఇండ్లలో వెండి, బంగారం, నగదు చోరీ
హైదరాబాద్ పెద్దఅంబర్‌పేట్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా 2 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్‌లను బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. 5 కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదు, విలువైన చీరలు అపహరించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాల ఆధారంగా.. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటిలో దొంగలు హల్‌చల్ చేయడంతో కాలనీ వాసులు భయాందోళనకి గురవుతున్నారు.