Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో విద్యార్థి మిస్సింగ్‌ కథ విషాదాంతం

* బోధన్‌ రోడ్లపై ఆందోళనలకు దిగారు మృతుడి బంధువులు

Update: 2022-12-12 06:50 GMT

నిజామాబాద్‌ జిల్లాలో విద్యార్థి మిస్సింగ్‌ కథ విషాదాంతం

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో విద్యార్థి మిస్సింగ్‌ కథ విషాదాంతమైంది. బోధన్‌ పసుపువాగు‎లో శ్రీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. 80 రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిన శ్రీకాంత్‌ కనిపించకుండా పోయాడు. అయితే బోధన్‌కు చెందిన ఓ యువతిని శ్రీకాంత్ ప్రేమించినట్టు స్థానికులు చెబుతున్నారు. తమ కుమారుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు శ్రీకాంత్‌ తల్లిదండ్రులు. అమ్మాయి తరఫు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోధన్‌ రోడ్లపై ఆందోళనలకు దిగారు మృతుడి బంధువులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News