అరెస్ట్ అయిన ఆర్టీసీ కార్మికులకు అన్నం పెట్టిన పోలీసులు

Update: 2019-11-26 12:04 GMT
ఆర్టీసీ

అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులకు వరంగల్ జిల్లా పోలీసులు భోజనాలు వడ్డించారు. ఈ ఉదయం వరంగల్ వన్, టు డిపోల వద్దకు డ్యూటీలో చేరేందుకు కార్మికులు రాగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆకలితో అల్లాడుతున్న కార్మికులను స్థానిక ఫంక్షన్ హాల్ కు తరలించారు. ఉదయం టిపిన్ అందజేసిన పోలీసులు మధ్యాహ్నం భోజనం పెట్టారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహారించినా పోలీసులు కడుపు నిండా అన్నం పెట్టారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.

Tags:    

Similar News