Kaleshwaram Project: కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
Kaleshwaram Project: ఓపెన్ కోర్టులో విచారణకు హాజరైన సీడీఓ తాజా, మాజీ ఇంజనీర్లు
Kaleshwaram Project: కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతోంది. ఓపెన్ కోర్టులో సీడీఓ తాజా, మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు. బ్యారేజీల డిజైన్లు అప్రూవల్ పొందిన తర్వాత..మార్పులు ఏమైనా జరిగాయా అని కమిషన్ ప్రశ్నించింది. అప్రూవల్ చేసే ముందు, తర్వాత నిబంధనలు పాటించారా అని ప్రశ్నించారు. కమిషన్ ప్రశ్నలకు ఇంజనీర్లు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇంజనీర్ల సమాధానాలపై జస్టిస్ చంద్రఘోష్ సీరియస్ అయ్యారు. హైపవర్ కమిటీలో సీడీఓ అధికారులు సభ్యులుగా ఉన్నారని ఇంజనీర్లు తెలిపారు. డిజైన్లు తయారు చేసే ముందు సైట్ విజిట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్నారం, సుందిళ్ల లోకేషన్లు మారాయని.. మేడిగడ్డ లోకేషన్ మారలేదని ఇంజినీర్లు కమిషన్‌కు తెలిపారు.