High Court: మునుగోడు ఎన్నికల వేళ.. హైకోర్టులో టీఆర్ఎస్‌‌కు షాక్

High Court: కారును పోలిన గుర్తులను కేటాయించవద్దంటూ హైకోర్టులో టీఆర్ఎస్ పిటిషన్‌

Update: 2022-10-18 11:25 GMT

High Court: మునుగోడు ఎన్నికల వేళ.. హైకోర్టులో టీఆర్ఎస్‌‌కు షాక్ 

High Court: మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతున్న వేళ అధికార టీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. కారును పోలిన గుర్తుల కేటాయింపు విషయంపై చేసిన న్యాయపోరాటంలో ఎదురుదెబ్బ తగిలింది. ఉపఎన్నికలో కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ టీఆర్ఎస్‌ పార్టీ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికల కమిషన్ వాదనలతో ఏకీభవించి టీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ ఉపఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్‌ గతంలోనే గుర్తులను విడుదల చేసింది. అందులో తమ పార్టీ గుర్తైన కారును పోలిన గుర్తులున్నాయని ఆరోపించింది.

అందులో కెమెరా, చపారతీ రోలర్, డాలీ, రోడ్‌రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ లాంటి సింబల్స్‌ తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని గతంలో ఈసీకి కంప్లైంట్ చేసింది. ఇలాంటి గుర్తుల వల్ల గతంలో జరిగిన నష్టాన్ని కూడా లెక్కగట్టి వివరించింది. అయితే దీనిపై ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. మొదట హౌజ్‌మెషన్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం నిరాకరించింది. తర్వాల లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈసీ అధికారుల వాదనలతో ఏకీభవించింది. చివరికి టీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను ధర్మాసం కొట్టివేసింది. ఏ గుర్తులను కేటాయించరాదని తాము ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News