తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హన్స్ ఇండియా పదవ వార్షికోత్సవ వేడుకలు
The Hans India: సమాజ దర్పణం పత్రికలు సమాజంలో ఏం జరుగుతోందో కళ్లకు కట్టినట్లు వివరించడమే కాదు ప్రజలను చైతన్యం చేయడంలోనూ పత్రికలది అగ్రస్థానమే.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హన్స్ ఇండియా పదవ వార్షికోత్సవ వేడుకలు
The Hans India: సమాజ దర్పణం పత్రికలు సమాజంలో ఏం జరుగుతోందో కళ్లకు కట్టినట్లు వివరించడమే కాదు ప్రజలను చైతన్యం చేయడంలోనూ పత్రికలది అగ్రస్థానమే. జెండా, ఎజెండా లేకుండా నిజాన్ని నిర్భయంగా నిస్పక్ష పాతంగా చూపే పత్రికలకు ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నది జగమెరిగిన సత్యం జర్నలిజం ప్రమాణాలను పాటిస్తూ పత్రికా ప్రపంచంలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్న హెచ్ ఎంటీవీ అనుబంధ సంస్థ హన్స్ ఇండియా పదవ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో హన్స్ ఇండియా పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలో కర్నూలు, విజయనగరం, గుంటూరు, తిరుపతి లలో హన్స్ ఇండియా పత్రికకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియ చేశారు. కర్నూలు లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరులో ఎస్పీ విశాల్ గున్నీ తదితరులు వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక తెలంగాణలోనూ హన్స్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలకు మంచి వార్తలనందించడంలో హన్స్ ఇండియా నిబద్ధతతో పనిచేస్తోందని హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్ అన్నారు. పోలీస్ సోషల్ మీడియాలో కూడా పేపర్ కటింగ్ లనే వినియోగిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ లలో హన్స్ ఇండియా వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్య అతిధులు పత్రిక నిస్పక్ష పాత ధోరణిని ప్రశంసించారు.