Shiva Balakrishna: నాలుగో రోజు HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ విచారణ
Shiva Balakrishna: లాకర్ల నుంచి పెద్దమొత్తంలో ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ
Shiva Balakrishna: నాలుగో రోజు HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ విచారణ
Shiva Balakrishna: 4వ రోజు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ దర్యాప్తు బృందం విచారిస్తుంది. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను అక్రమ ఆస్తుల విషయంలో ప్రశ్నిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. బాలకృష్ణకు సంబంధించిన మూడు బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ... లాకర్లలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ పని చేసిన ఆఫీస్‌కు తీసుకెళ్లి బీరువాను బద్దలు కొట్టి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే బినామీలు, శివబాలకృష్ణ పని చేసిన సమయంలో పలు ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారులకు కూడా ఏసీబీ నోటీసులు అందజేసింది.