Manikrao Thakre: పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం.. సీపీఐతో అనధికారిక సమావేశం మాత్రమే జరిగింది
Manikrao Thakre: పొత్తులు, సీట్ల పంపకంపై ఎలాంటి చర్చ జరగలేదు
Manikrao Thakre: పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం.. సీపీఐతో అనధికారిక సమావేశం మాత్రమే జరిగింది
Manikrao Thakre: పొత్తులపై లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరగలేదని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే అన్నారు. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎల్‌పీ, పీసీసీ సమక్షంలోనే పొత్తులపై చర్చలు ఉంటాయన్నారు. సీపీఐతో అనధికారిక సమావేశం మాత్రమే జరిగిందని... పొత్తులు, సీట్ల పంపకంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కాంగ్రెస్ కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. డైరెక్ట్ గా హై కమాండ్ చర్చలు జరపమని చెప్పలేదన్నారు. రాష్ట్రంలో పార్టీకి ఉపయోగ పడే విషయాలు పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు థాక్రే.