Talasani Srinivas Yadav: మన బస్తీ, మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష

Talasani Srinivas Yadav: ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యం

Update: 2023-01-05 11:06 GMT

Talasani Srinivas Yadav: మన బస్తీ, మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష 

Talasani Srinivas Yadav: ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడం కోసమే మనబస్తీ - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు మంత్రి. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో, హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలల్లో మన బస్తీ - మన బడి కార్యక్రమం కింద అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మన బస్తీ మన బడి కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. 

Tags:    

Similar News