TGSPSC Group 1 results: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల

Update: 2025-03-10 09:46 GMT

TGSPSC Group 1 results: తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల

Telangana Group 1 reults released : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసింది. 563 పోస్టులను భర్తీ చేయడమే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,151 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

మొత్తం గ్రూప్ 1 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రిలీమ్స్ తరువాత మెయిన్స్ కు క్వాలిఫై అయిన వారి సంఖ్య 67.3 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్ 21 నుండి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.

రీకౌంటింగ్ - ఒక్కో పేపర్‌కు రూ. 1000

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థుల మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు టీఎస్పీస్సీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. మార్కుల విషయంలో అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంది. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

రీకౌంటింగ్ ముగిసిన తరువాత అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తారు. దీంతో గ్రూప్ 1 నియామకాల తుది ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు అవుతుంది.

గ్రూప్ 1 నియామకాలు పూర్తయిన తరువాత గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.      

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.  

Tags:    

Similar News